మాట్టాడ వద్దు అనుకుంటే మౌనమే చాలు అనుకున్నాను
కలవడం వద్దు అనుకుంటే కళ్ళల్లోనే ఉన్నాననుకున్నాను
చేతల్లో చికాకు చూసి మనసులోనే ఉన్నాననుకున్నాను
విడిపోతున్నాము అని తెలిసి
మళ్ళీ కలుస్తామనే ఆశతో బ్రతుకుతున్నాను
కలల ప్రయాణం మెలుకువ వరకు
అలల ప్రయాణం తీరం వరకు
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు
స్నేహం ప్రయాణం జీవితాంతం వరకు
ఈ క్షణం ఇలా ఒక కోరిక
నీ స్వరం వినాలని తీయగా
నీ రాకకై వేచి ఉన్న.......
ఒంటరి తనమంటే
చెంపమీద జారే నీటి చుక్క ఆరడానికి
గాలి కూడా సహకరించకపోవడం!
నా ఈ భావాన్ని నీకు చెబుదామంటే
నువ్వు కాదంటావేమోనని భయం...
నాలో నేను దాచుకుంటే
మనసు అంతరంగపు పొరల్లో
అది నిక్షిప్తమై సంతోషాన్ని ఇస్తుంది.
చెప్పటం కన్న చెప్పకపోవటంలో ఎక్కువ సంతోషం వుంది.
ఒకే గొడుగులో నడిచిన
మన అడుగులకు తెలుసు ప్రేమంటే!
ఒకే మెరుఉకు కలిసిన
మన కనులకు తెలుసు ప్రేమంటే!
కంటి సైగతో పలకరిస్తే! బదులు పలికే
నీ చిరునవ్వు పెదవికి తెలుసు ప్రేమంటే!
మమత నిండిన నీ చేతి స్పర్శకు
స్పందించే నా మదికి తెలుసు ప్రేమంటే!
కలలు నిజమై కలము కవితై
కలసిపోయే మన హృదయమే ప్రేమంటే!